Friday, May 17, 2024

స్పేస్ స్టేష‌న్ నుంచి మ‌న హైద‌రాబాద్‌.. అబ్బుర‌ప‌రుస్తున్న నాసా ఫొటోలు

మన హైదరాబాద్ సిటీలో ఎన్నో అద్భుత కట్టడాలతో పాటు ఎన్నో వింతలు, విశేషాలకు కొదవేలేదు. గోల్కొండ లాంటి ఎత్తైన క‌ట్ట‌డాల‌ నుంచి భాగ్యనగరాన్ని చూస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేం. హైదరాబాద్ అందాలను డ్రోన్ల సాయంతో ఆకాశం నుంచి చిత్రీకరించిన వీడియోలు సోషల్‌మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. వాటిని చూస్తుంటే మనం ఉన్న ఈ మహానగరంలో ఇన్ని వింత‌లు, ఇంత అందం ఉందా? అన్న అనుభూతి కలగకమానదు.

అలాంటి హైదరాబాద్ నగరం ఆకాశం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుంది.. స్పేస్ నుంచి హైద‌రాబాద్ వ్యూ ఎట్లుంట‌ది అనే కలను నిజం చేస్తూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) చూపించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి హైదరాబాద్ సిటీ లైట్లు ఎలా కనిపిస్తున్నాయనే చిత్రాన్ని నాసా తాజాగా విడుదల చేసింది. సిటీ లైట్లు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ క‌నిపిస్తున్న ఈ ఫొటోను చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తాజాగా నాలుగు ఫొటోలను తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అందులో ఈజిప్ట్ నుంచి కైరో, సౌదీ అరేబియా నుంచి యాన్బు, ఇండియా నుంచి హైదరాబాద్, థాయిలాండ్ నుంచి బ్యాంకాక్ వంటి ఫొటోలున్నాయి.. వాట‌న్నింటినీ ట్విటర్లో పోస్ట్ చేసింది. వీటిలో అన్నింటికంటే రాత్రివేళ తీసిన హైదరాబాద్‌ నగరం ఫోటో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి రాత్రిపూట అనేక నగరాలకు సంబంధించిన 180 ఫోటోలు ఉన్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement