Tuesday, June 4, 2024

ఏరో స్పేస్ హ‌బ్ గా హైద‌రాబాద్ – కెటిఆర్

హైదరాబాద్‌: ఏరోస్పేస్‌ రంగానికి హైదరాబాద్‌ హబ్‌గా మారుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో విమానయానరంగం అభివృద్ధిపై మండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ, ఏరోస్పేస్‌ తయారీ, ఇంజినీరింగ్‌, మెటీరియల్‌ విభాగాల్లో 3 నుంచి 5 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో 7 ఎస్‌ఈజెడ్‌లలో ఏరోస్పేస్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆదిభట్లలో డెడికేటెడ్‌ ఏరోస్పేస్‌ హబ్‌ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రానికి డిఫెన్స్‌ కారిడార్‌ ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. డిఫెన్స్‌ కారిడార్‌ ఏర్పాటుకు రాష్ట్రం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అయితే దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే కేంద్రం ప్రాధాన్యత ఇస్తున్నదని ఇదే సంద‌ర్భంగా విమర్శించారు. అయినప్పటికీ హైదరాబాద్‌-బెంగళూరు మధ్య డిఫెన్స్‌ కారిడార్‌ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారు. ఏరోస్పేస్‌ రంగానికి రాష్ట్రంలో ఉజ్వల భవిష్యత్‌ ఉందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement