Friday, March 29, 2024

కొవిడ్ వ్యాప్తికి అడ్డాగా గ్రేట‌ర్ హైద‌రాబాద్…

హైదరాబాద్‌, : గతేడాది తొలిసా రిగా విజృం భించినప్పటిలాగే ప్రస్తుత సెకండ్‌వేవ్‌ వ్యాప్తిలోనూ తెలంగాణలో రాజధాని హైదరాబాద్‌ కరోనా వైరస్‌ వ్యాప్తికి కేంద్రంగా ఉంటోంది. అయితే గతేడాది రాష్ట్రవ్యాప్తంగా రోజువారి నమోదైన కొత్త కేసుల సంఖ్య ప్రస్తుతం సెకండ్‌వేవ్‌లో కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ( జీహెచ్‌ఎంసీ) పరిధిలోనే రికార్డవుతుండడం రాజధాని వాసులను ఆందోళన కలిగిస్తోంది. ఒక రోజును మించి మరుసటి రోజు గ్రేటర్‌ పరిధిలో నమోదవుతున్న కొత్త కొవిడ్‌ కేసులు రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో సగటున 15 శాతం దాకా ఉంటున్నాయంటే పరిస్థితి అర్థమవుతోంది. సెకండ్‌వేవ్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజూ నాలుగంకెల్లో కొత్త కేసులు వెలుగుచూస్తుండడం రాష్ట్రవ్యాప్త పాజిటివిటీ రేటును తాజాగా మంగళవారం 10 శాతం దాటించింది. కొవి డ్‌ వ్యాప్తి కట్టడికి గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఇటీవల మినీ కంటైన్మెంట్‌ జోన్‌లు ఏర్పా టు చేసినప్పటికీ ఆ ప్రాంతాల్లో గతంలోలా నిబం ధనలు కఠినంగా అమలు చేయకపోవడం వల్ల ఏ మా త్రం ప్రయోజనం లేకుండా పోతోందని ఒకరోజు కేసు లు ఎక్కువగా నమోదైన ప్రాంతంలో మరుసటి రోజు కూడా ఎక్కువగానే నమోదవుతుండడం దీనికి నిదర్శ నమని పలువురు నగరవాసులు వాపో తున్నారు.
జీహెచ్‌ఎంసీ కేంద్రంగా పరిసర జిల్లాల్లోకి జోరుగా వైరస్‌ వ్యాప్తి…
జీహెచ్‌ఎంసీలో కరోనా విజృంభనతో కేవలం హైదరాబాద్‌ నగరంలోనే కాకుండా చుట్టు పక్క జిల్లా ల్లోనూ రోజువారి అత్యధికంగా కేసులు నమోదవు తున్నాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాల్లోని ప్రజలు రోజూ వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లి వస్తుం టారు. దీంతో వైరస్‌ వ్యాప్తి సులభమవుతోందని పలువురు విశ్లేషిస్తున్నారు. సెకండ్‌వేవ్‌లో తొలుత ఈ జిల్లాల్లో అంతంగా కేసులు నమోదుకానప్పటికీ అనం తరం ఒక్కసారిగా ఈ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండడమే జీహెచ్‌ఎంసీ కేంద్రం గానే ఇక్కడికి వైరస్‌ వ్యాప్తి జరుగుతోందని వారు చెబుతున్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాకు చెందిన జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే కుత్బుల్లాపూర్‌, బాలా నగర్‌, ఈసీఐఎల్‌, బోడుప్పల్‌లో రోజూ ఎక్కువగా కేసులు నమోదువుతున్నాయి.
కాగా, హయత్‌ నగర్‌, బీఎన్‌రెడ్డి లాంటి రంగారెడ్డి జిల్లాకు చెందిన జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లోనే రంగారెడ్డి జిల్లా రోజువారి కేసుల్లో ఎక్కువ శాతం ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో మినీ కంటైన్మెంట్‌ జోన్‌లు ఎక్కువగా ఉండ డాన్ని బట్టి ఈ జిల్లాల్లో కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధి లోకి వచ్చే ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంటున్నాయని చెప్పవచ్చని వారు పేర్కొంటున్నారు.
కొత్త కేసుల్లో 19శాతం పైగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే…
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరోనా కేసుల బుల్లెటిన్‌ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8061 కొత్త కేసులు నమోదైతే అందులో 19 శాతానికిపైగా 1508 కొవిడ్‌ పాజిటివ్‌లు కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోద య్యాయంటే పరిస్థితి అర్థమవుతోంది. నమోదైన కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీ తర్వాత రాష్ట్రంలో మేడ్చల్‌ మల్కాజిగిరిలో అత్యధికంగా 673 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదు కాగా, రంగారెడ్డిలో 514 కొవిడ్‌ కొత్త కేసులు రికార్డ య్యాయి. జీహెచ్‌ఎంసీ ప్రభావంతోనే రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్ రోజువారి అధిక కేసులు స్థిరంగా నమోదవుతున్నా యని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వికారాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన 15 కంటైన్మెంట్‌ జోన్‌లు ఎక్కువగా ఫామ్‌హౌజ్‌లు, విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయంటే వీరంతా రోజూ హైదరాబాద్‌కు వెళ్లివచ్చేవార యినం దువల్లే ఇక్కడ కేసులు కేంద్రీకృతమై ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. మినీ కంటైన్మెంట్‌ జోన్‌లను పరీక్షలు చేసే పీహెచ్‌సీల వారిగా ఏర్పాటు చేసి కఠినంగా నిబంధనలు అమలు చేస్తే త్వరలోనే మంచి కొవిడ్‌ను కట్టడి చేయవచ్చని వారు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement