Saturday, April 20, 2024

కేజీఎఫ్2 హిందీ వెర్షన్ కి డబ్బింగ్ అతనేనట ??

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ ఎస్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం కేజిఎఫ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో మంచి కలెక్షన్లను సాధించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కేజిఎఫ్ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఇటీవల ఈ సినిమాకు హిందీ వెర్షన్ కోసం స్వయంగా యష్ నే డబ్బింగ్ చెబుతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత బాలీవుడ్ ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ సంకేత్ మహీత్రూ డబ్బింగ్ చెప్పనున్నాడని వార్తలు వచ్చాయి.కాగా దీని పై సంకేత్ ఈ వార్త పూర్తిగా అబద్దం అని ఇందులో ఎలాంటి నిజమూ లేదని తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఖండించాడు. దీనితో యష్ రోల్ కు తానే డబ్బింగ్ చెబుతున్నారని వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement