Wednesday, September 20, 2023

HYD: సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలి… జోనల్ కమిషనర్ ను కోరిన కార్పొరేటర్

కర్మన్ ఘాట్, సెప్టెంబర్ 13( ప్రభ న్యూస్) : హస్తినాపూర్ డివిజన్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజను స్థానిక కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ కోరారు. బుధవారం జోనల్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ పంకజను కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి, డివిజన్ పరిధిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు.

- Advertisement -
   

దీంతో పాటు సూర్య టౌన్ షిప్ పార్వతమ్మ ఎంక్లేవ్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కోరారు. డివిజన్ లో నెలకొన్న సమస్యలపై జోనల్ కమిషనర్ తో చర్చించినట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు దృష్టికి పలు సమస్యలను తీసుకు వెళ్లనున్నట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ త్వరలో సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించనున్నట్లు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement