Sunday, June 16, 2024

FollowUP | రూటు మార్చిన చైన్‌ స్నాచర్స్‌.. ఒంటరి పురుషులే టార్గెట్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఒంటరి మహిళల మెడలోని చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడే దొంగలు రూటు మార్చారు. ఓ కిరాణాషాపు యజమాని కంట్లో కారం చల్లి మెడలోని బంగారు గొలుసుతో పరారయ్యారు. ఈ ఘటన వనస్థలిపురంలో బుధవారం తెల్లవారుజామున చోట చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సాహెబ్‌నగర్‌ పద్మావతి కాలనీలో బండారి గోవర్ధన్‌ శ్రీ మహాలక్ష్మి కిరాణా షాప్‌ నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంలో బుధవారం ఉదయం 6 గంటలకు రవీంద్ర భారతి పాఠశాల దగ్గర పాలను తీసుకొని గోవర్ధన్‌ వస్తుండగా మార్గమధ్యలో చైన్స్‌ స్నాచర్లు గమనించారు. ఇద్దరు చైన్‌ స్నాచర్లు గోవర్ధన్‌ వెంబడించి అతని కళ్ళలో కారం చల్లి అతని మెడలోని బంగారు గొలుసు తీసుకుని ద్విచక్ర వాహనంపై పారిపోయారు. కాగా గోవర్ధన్‌ అప్రమత్తమై కళ్ళలోని కారమును దులుపుకొని వారిని వెంబడించాడు. అయితే ఒకరు ద్విచక్ర వాహనం తీసుకొని సామాన్‌ నగర్‌ వైపు పారిపోయారు.

దారిదోపిడీ, దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్‌మరొకరు వీరాంజనేయ కాలనీ వైపు పరిగెడుతుండగా పట్టుకునేందుకు సమీపంలోని కిరాణా షాపు దగ్గర చేసి ఉన్న ద్విచక్ర వాహనం తీసుకొని వీరాంజనేయ కాలనీ వైపు వెళ్లాడు. కాగా చైన్స్‌ స్నాచర్‌ అప్పటికే పరుగు తీశాడు. బాధితుడు గోవర్ధన్‌ వెంటనే వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చైన్‌ స్నాచర్ల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement