Thursday, May 2, 2024

పోలార్డ్ రిటైర్మెంట్ పై షాకైన అభిమానులు : కూ లో పోస్ట్ చేసిన ఉత‌ప్ప‌, పుజారా

వెస్టిండీస్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్ ప్రధాన ఆటగాడు కీరన్ పొలార్డ్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పొలార్డ్ నిర్ణయం సోషల్ మీడియాను ఆశ్చర్యానికి గురి చేసింది. అతను అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలగడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అభిమానులు, స్నేహితులు, సహచరులను ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది చివర్లో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్‌కు పొలార్డ్ కీలక పాత్ర పోషిస్తాడని ఆశించారు. అతని భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు సందేశాలతో నిండిపోయాయి. భారత క్రికెటర్ & చెన్నై సూపర్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప కూ-లో పోస్ట్ చేశాడు. అది ఆశ్చర్యం కలిగించింది. @KieronPollard55! ప్రతిదానికీ శుభాకాంక్షలు, త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను అని తెలిపాడు. అలాగే చ‌టేశ్వ‌ర్ పుజారా కూడా కీర‌న్ పోలార్డ్ గురించి కూ లో పోస్ట్ చేశాడు. వెస్టిండీస్ రంగుల్లో మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉందన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement