Thursday, April 25, 2024

తెలుగు సాహిత్య ప్రపంచానికి భాషా శాస్త్రవేత్తగా డా.చేకూరి రామారావు.. ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

చేకూరి రామారావు 1934 అక్టోబర్ 1న‌ ఖమ్మంలోని మధిర తాలూకా ఇల్లెందులపాడులో జన్మించి.. తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, భాషా శాస్త్రవేత్తగా పిలువబడేవారని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ, కళా సుబ్బారావు కళా వేదికలో ఏర్పాటు చేసిన ప్రముఖ సాహితీవేత్త చేకూరి రామారావు 88వ జయంతి ఉత్సవానికి ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ఆధునిక భాషా శాస్త్ర రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన నామ్ చామ్‌స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్త ఒరవడికి ఆద్యుడ‌య్యాడన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత కవులు, కళాకారులకు, సాహిత్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాడన్నారు. అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమ‌న్నారు. అంతకు ముందున్న ప్రభుత్వాలు కళా రంగాన్ని, సాహిత్య రంగాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సాహిత్య సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేన‌న్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా వి.ఎస్.జనార్దన్ మూర్తి, సీనియర్ పాత్రికేయులు జయసూర్య, ప్రముఖ నృత్య గురువు యస్.పి.భారతి, త్యాగరాయ గానసభ ప్రధాన కార్యదర్శి శారదాదీక్షితులు, త్యాగరాయ గానసభ పాలకమండలి సభ్యులు గుండవరపు గీతాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement