Sunday, April 28, 2024

రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రదాత దొడ్డి కొమురయ్య – లోకేష్ కుమార్

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రదాత దొడ్డి కొమురయ్య అని జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్ అన్నారు. దొడ్డి కొమరయ్య 97వ జయంతి సందర్భంగా సోమవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… వెట్టి చాకిరి నిర్మూలనకు పోరాడి తొలి అమరుడయ్యారని తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచాడని కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ.ఎన్.సి జియావుద్దీన్, అడిషనల్ కమిషనర్ యాదగిరిరావు, వి.కృష్ణ, చీఫ్ పి ఆర్ ఓ మహమ్మద్ ముర్తుజా, ఎంటమాలజి చీఫ్ డాక్టర్ రాంబాబు, ఏ.ఎం.సి జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement