Friday, May 17, 2024

క్రిప్టో అంటే రాత్రికి రాత్రే ధనవంతులయ్యే స్కీమ్ కాదు

లక్షలాది మంది డిజిటల్ అవగాహన ఉన్న భారతీయులు క్రిప్టో అసెట్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అన్వేషణ చేస్తున్నారు. ఇందుకోసం వారు ఇతర దేశాల్లో తమ సమకాలీనుల అనుభవాలు, అభిప్రాయాల నుంచి సూచనలు స్వీకరిస్తున్నారు. అయితే ఇదే సమయంలో పరిశ్రమ నిపుణులు, అనుభవజ్ఞులతో సహేతుకమైన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేందుకు భారతీయ రెగ్యులేటర్లు కృషి చేస్తున్నారు. క్రిప్టోలు అంటే బ్లాక్‌చైన్‌ ద్వారా నిర్వహించబడే డీసెంట్రలైజ్డ్‌ డిజిటల్ అసెట్స్. సరళంగా చెప్పాలంటే, కంపెనీలకు స్టాక్స్‌ ఎలాగో, బ్లాక్‌చైన్‌కు ఈ అసెట్స్‌ అలాంటివి. మార్కెట్ ఓ కంపెనీకి ఇచ్చే విలువను స్టాక్ ధర ప్రతిబింబిస్తుంది. క్రిప్టో అసెట్ ధర సంబంధిత బ్లాక్‌చైన్‌ టెక్నాలజీకి చెందిన వ్యాపార సామర్ధ్యాన్ని ప్రతిబింబిస్తుంది లేదా మార్కెట్ ఆశిస్తున్న లాభాలను సూచిస్తుంది. భారతీయులు మార్కెట్ రీసెర్చ్‌ ఫరమ్ చైనాలిసిస్‌ ప్రకారం, రూ.446.5 కోట్ల (58.4 మిలియన్ డాలర్లు)ను వివిధ క్రిప్టో అసెట్స్‌లో పెట్టుబడి చేయడంతో, క్రిప్టోను స్వీకరిస్తున్న ప్రమాణాల ప్రకారం, ఇండియాను రెండవ అతి పెద్ద దేశంగా నిలిపారు.

కానీ సంప్రదాయ పెట్టుబడి ఆస్తులతో పోల్చితే క్రిప్టోలు ఎంతో ఒడిదుడుకులకు గురవుతాయి. అతి పాతదైన క్రిప్టో బిట్‌కాయిన్‌ను ఉదాహరణగా తీసుకుంటే, దీనికి అనేక అధిక, అల్ప స్థాయిలు ఉన్నాయి. 2014లో బిట్‌కాయిన్ ధర 86 శాతం క్షీణించి 14,886 (194 డాలర్లు)కు పడిపోయింది. 2017లో ఇది అప్పటి ఆల్‌టైం గరిష్ట స్థాయి 14.6 లక్షల (19,102 డాలర్లు)కు చేరుకుంది. 2018లో ఇది కోలుకునేందుకు ముందు 2.6 లక్షల (3,401 డాలర్లు) కిందకు పడిపోయింది. 2020లో, బిట్‌కాయిన్ తన మార్కెట్ విలువలో 50 శాతం కోల్పోయింది. ఏప్రిల్ 2021లో ఇది తిరిగి ఆల్‌టైం గరిష్ట స్థాయి 48.2 లక్షల (63,064 డాలర్లు)కు చేరుకుంది.
ఈ అసెట్‌ క్లాస్‌తో ప్రయోగం చేయాలని ఆలోచన ఉన్న వారు, క్రిప్టో అసెట్స్‌ యొక్క ఫండమెంటల్స్‌, శక్తి సామర్ధ్యాలను అంచనా వేయడానికి, తమ సొంత పరిశోధన చేయాలి. ఇన్వెస్ట్ చేయడంలో ప్రధాన నిబంధన ఏమిటంటే, “మీరు నష్టపోయేందుకు భరించగల మొత్తాన్ని పెట్టుబడి చేయండి,” ఇది క్రిప్టోలకు కూడా వర్తిస్తుంది. ఈ అసెట్‌ క్లాస్‌ను త్వరగా ధనవంతులు అయ్యే స్కీమ్‌గా అర్థం చేసుకోకూడదు.
డిస్‌క్లియిమర్‌: ఈ ఆర్టికల్‌లో ఉన్న కంటెంట్ కేవలం సమాచారం కోసమే ఇవ్వబడింది, మరియు ఇది ఏ పెట్టుబడి లేదా ఆర్థిక సలహాగా పరిగణించేందుకు ప్రత్నామ్నాయంగా ఉద్దేశించబడలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement