Saturday, October 12, 2024

HYD: యోధలో భాగం కావడమే ఒక అసాధారణమైన ప్రయాణం… సిద్ధార్థ్ మల్హోత్రా

హైదరాబాద్ : ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపుదిద్దుకోగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్లాక్‌బస్టర్ యోధ చిత్ర ప్రమోషన్స్ కోసం ఆ చిత్ర ప్రధాన తారాగణం సిద్ధార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నా హైదరాబాద్‌కు చేరుకోవటంతో ఈ చిత్రం పై ఆసక్తి తారాస్థాయికి చేరుకుంది. బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ మాస్టర్ పీస్ మేకింగ్ గురించి ఆకర్షణీయమైన అంశాలను వెల్లడించారు.

అభిమానులకు ఉద్దేశించి సిద్ధార్థ్ మల్హోత్రా మాట్లాడుతూ… యోధలో భాగం కావడమే ఒక అసాధారణమైన ప్రయాణమ‌న్నారు. సినిమా కథనం అత్యంత ఆసక్తిగా ఉండటమే కాదు ధైర్యం, దేశభక్తి స్ఫూర్తిదాయకంగానూ ఉంటుందన్నారు. ప్రేక్షకుల స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు. ఈ సినిమాలో భాగం కావటం పట్ల రాశి ఖన్నా తన సంతోషం వ్యక్తం చేస్తూ…. యోధ లో పని చేయడం ఒక ఉత్తేజకరమైన అనుభవమ‌న్నారు. అటువంటి ప్రభావవంతమైన కథనంలో భాగమయ్యే అవకాశం కల్పించినందుకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సినిమా కథనంలోనే ధైర్యం, ప్రేమను అందంగా మిలితం చేశారన్నారు. ఇది నిజంగా ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. పెద్ద స్క్రీన్‌పై ఈ చిత్రాన్ని చూడటానికి ప్రేక్షకులతో పాటుగా తాను కూడా ఆసక్తిగా చూస్తున్నానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement