Wednesday, May 15, 2024

సమావేశానికి ముందే వేడెక్కిన బల్దియా.. ఆందోళనకు దిగిన విపక్షాలు

నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. అయితే అంతకుముందే విపక్షాలు నగర పాలక సంస్థ తీరును నిరసిస్తూ.. ఆందోళనకు దిగారు. నాలాల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. సమస్యను పరిష్కరించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. వాన వస్తే నీళ్లు, నిప్పులే కాదు.. హైదరాబాద్ నగరంలో చావు వస్తుందన్నారు. అధికారులారా ఆఫీస్ బయటకి రండి.. పౌరుల కష్టాలు చూడండి అంటూ నినాదాలు చేశారు. కేటీఆర్ 15 వేల కోట్లు ఇవ్వండి.. హైదరాబాద్ నాలాలను అభివృద్ధి పరచండి.. మొన్న సుమేధ నిన్న మౌనిక రేపు ఇంకెందరో.. ? వాన వస్తే బలికావాల్సిందేనా.. అంటూ జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement