Saturday, May 11, 2024

తెలంగాణాలో రేప‌టి నుంచి అన్ని విద్యా సంస్థ‌ల బంద్

హైద‌రాబాద్ – తెలంగాణ‌లో రేప‌టి నుంచి అన్ని విద్యా సంస్థ‌లు మూసివేయ‌నున్నారు.. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది..ఈ మేర‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్ర‌క‌టించారు.. కేసులు పెరుగుతున్న దృష్ట్యా, విద్యార్ధుల త‌ల్లిదండ్రుల విజ్ఞ‌ప్తును ప‌రిశీలించిన అనంత‌రం ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు.. విద్యా సంస్థ‌ల‌లో బౌతిక‌దూరం క‌ష్టంగా మార‌డంతో క‌రోనా కేసులు పెరుగుతున్న‌ట్లు గుర్తించ‌మ‌న్నారు.. ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు.. ఆన్ లైన్ క్లాసులు య‌థావిధిగా నిర్వ‌హిస్తామ‌న్నారు.. కాగా మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌కు మాత్రం మిన‌హాయింపు ఇచ్చారు.. కాగా, అంత‌కు ముందు స‌బితా ఇంద్రారెడ్డి ముఖ్య‌మంత్రి కెసిఆర్ తో భేటి అయ్యారు.. విద్యా సంస్థ‌ల మూసివేత‌పై చ‌ర్చించారు.. అనంత‌రం విద్యా సంస్థ‌ల‌ను రేప‌టి నుంచి మూసి వేస్తున్న‌ట్లు స‌బితా ప్ర‌క‌టించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement