Tuesday, April 30, 2024

Homam – వైభవంగా మహాగణపతి హోమం.. పాల్గొన్న ఎమ్మెల్యే విజయ రమణారావు

అయ్యప్ప దీక్షాపరుల భజనల మధ్య పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో మహా గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామునుండే ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోత్సవాల మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన మహా గణపతి హోమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ ఆది గణపతి ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించానన్నారు. అయ్యప్ప దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప దీక్షాపరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement