Tuesday, April 30, 2024

Helping Hand – నిరుపేద ఎంబిబిఎస్ విద్యార్ధుల‌కు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ రూ. 2 ల‌క్ష‌ల ఆర్ధిక సాయం

చెన్నూరు -నిరుపేద పేద విద్యార్ధుల‌కు అండ‌గా నిలిచారు విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్.. చెన్నూరు నియోజకవర్గం, కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన సుమంత్, చెన్నూర్ మండలం నారాయణపూర్ గ్రామ పంచాయతీకి చెందిన రంజిత్ లు ఎంబిబిఎస్ లో సీట్లు సాధించారు.. అయితే మెడిక‌ల్ క‌ళ‌శాల‌లో చేరేందుకు వారిద్ద‌రూ ఆర్ధికంగా ఇబ్బందిప‌డుతున్నారు.. విష‌యం తెలుసుకున్న బాల్క‌సుమ‌న్ వారిద్ద‌రిని హైద‌రాబాద్ లోని తన కార్యాల‌యానికి పిలిచి వివ‌రాల‌ను అడిగి తెలుకున్నారు.. తాత్కాలిక సాయంగా స‌మంత్, రంజిత్ ల‌కు చెరో ల‌క్ష రూపాయిలు అంద‌జేశారు.. అంతే కాకుండా ప్ర‌భుత్వ‌ప‌రంగా విద్యార్థి సుమంత్ కు అదనంగా మరో రెండు లక్షల అందించాలని కలెక్టర్ ను కోరారు.. ఉన్న‌త చ‌దువు విష‌యంలో ఏసాయం కావాల‌న్నా త‌న‌ను క‌ల‌వాల్సిందిగా సుమ‌న్ విద్యార్దుల‌కు సూచించారు.. త‌మ విద్య ఆగిపోకుండా ఆర్థిక‌సాయం అంద‌జేసిన ఎమ్మెల్యేకు సుమంత్,రంజిత్ లు కృతజ్ఞ‌త‌లు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement