Sunday, April 28, 2024

నాలుగు రోజులపాటు భారీ వర్షసూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాగల నాలుగు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంబీంఆసీఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. సోమ, మంగళవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

- Advertisement -

సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజమాబాద్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. మంగళవారం నుంచి గురువారం వరకు ఆదిలాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా-గ్యాంగ్‌టక్‌ ప శ్చిమబెంగాల్‌ తీరాల్లో సగటున సముద్రమట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు ఆవర్తనం ఏర్పడిందని అది ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశవైపుగా వంగి ఉందని అధికారులు తెలిపారు. మరో ఆవర్తనం ఈ నెల 18న బంగాళాఖాతంలో ఏర్పడుతుందని, దిగువ గాలులు పశ్చిమం వైపు నుంచి తెలంగాణకు వీస్తున్నందున రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది

Advertisement

తాజా వార్తలు

Advertisement