Wednesday, October 9, 2024

Yadadri: పోటెత్తిన భ‌క్తులు… ద‌ర్శ‌నానికి 3గంట‌ల స‌మ‌యం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. కార్తీకమాసం చివరి రోజుతో పాటు సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.

స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా లైన్లలో వేచివున్నారు. దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. కొండ కింద వ్రత మండపంలో భక్తులతో నిండిపోయింది. అధిక సంఖ్యలో భక్తులు వ్రతమాచరించారు. దీపారాధనలో భక్తులు భారీగా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement