Sunday, March 3, 2024

ఫేక్ ఆస్పత్రుల మూసివేతకు హెల్త్ డిపార్ట్‌మెంట్ యాక్ష‌న్‌.. ఆదేశాలు జారీ

రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుండా, క్వాలిఫైడ్ డాక్టర్లు, స్టాఫ్‌ లేకుండా నడుస్తున్న ప‌లు ప్రైవేటు హాస్పిటల్స్‌, క్లినిక్స్‌, డయాగ్నస్టిక్ సెంటర్ల మూసివేతకు రంగం సిద్ధమైంది. తెలంగాణ‌లోని అన్ని హాస్పిటల్స్‌, క్లినిక్స్‌, కన్సల్టేషన్ రూమ్స్‌, నర్సింగ్ హోమ్స్‌, పాలి క్లినిక్స్‌, డయాగ్నస్టిక్ సెంటర్స్‌, ఫిజియో థెరపీ యూనిట్స్‌, డెంటల్ హాస్పిటల్స్‌, క్లినిక్స్‌ను తనిఖీ చేయాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాసరావు అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలను ఆదేశించారు.

రానున్న 10 రోజుల్లో పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టాలని డీహెచ్ నుంచి అన్ని జిల్లాల‌కు ఉత్త‌ర్వులు అందాయి. తనిఖీల కోసం ప్రోగ్రామ్ ఆఫీసర్లు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలతో టీమ్‌లను ఏర్పాటు చేయాలని ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద చేసుకున్న రిజిస్ర్టేషన్ సర్టిఫికెట్, నిబంధనల ప్రకారం హాస్పిటల్ ఉందా? లేదా? డాక్టర్లు, స్టాఫ్‌ రిజిస్ర్టేషన్ సర్టిఫికెట్లను పరిశీలించాలని ఆదేశించారు. బయో వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు పాటిస్తున్నరా? లేదా? చూడాలని పేర్కొన్నారు. రూల్స్ ప్ర‌కారం న‌డ‌వ‌ని హాస్పిటళ్లకు నోటీసులు ఇవ్వాలని, అయినా విన‌కుంటే మూసేయ‌డం డీహెచ్‌ ఖాయ‌మ‌ని శ్రీ‌నివాస‌రావు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement