Thursday, April 18, 2024

TS: అత‌నే ఏక్‌నాథ్ షిండే! చెప్పేవ‌న్నీ అబద్ధాలే.. పాడి కౌశిక్‌రెడ్డి

ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు ? భర్తీ ఎప్పుడు జరిగిందో చెప్పాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేండ్లు పనిచేయాలని బీఆర్‌ఎస్‌ కోరుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలోనే మంత్రులు, ఎమ్మేల్యేలు రేవంత్‌కు రివర్స్ అయ్యే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్‌నాథ్ షిండే అయ్యేదే రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసు ట్రయల్స్ పూర్తి అయ్యాయి. మరో ఆరు నెలల్లో రేవంత్ రెడ్డికి శిక్ష పడటం ఖాయమన్నారు.

అన్నీ అబ‌ద్ధాలే..

- Advertisement -

రేవంత్ రెడ్డి పాతాలాజికల్ లయర్, ప్రతి నిత్యం అబద్దాలు ఆడడమే పనిగా పెట్టుకునే వాడిని పాతాలాజికల్ లయర్ అంటార‌ని ఎమ్మెల్యే పాడి అన్నారు. హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement