Tuesday, February 13, 2024

Revanth Reddy: అల్లుడి నోటి దూల‌తోనే రైతు బంధుకు బ్రేక్

హైద‌రాబాద్ – రైతు బంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశ్యం మామా – అల్లుళ్లకు లేదని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు నోటి దూల కారణంగానే రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఎన్నికల కమిసన్ ఉపసంహరించుకుంటున్నట్టు ఆదేశాలు ఇవ్వడమే దీనికి నిదర్శనం అని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు.. పది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15 వేల రూపాయల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాగా ఈసీ అనుమతి ఇచ్చిన తర్వాత మంత్రి హరీష్ రావు ఓ సభలో మాట్లాడుతూ.. ఉదయం రైతులు చాయ్ తాగే సమయానికి మీ ఫోన్లలో టింగ్ టింగ్ టింగ్ టింగ్ అంటూ రైతు బంధు పడ్డ మెస్సేజ్ లు వస్తాయని కామెంట్స్ చేశారు.. వీటికి పరిగణలోకి తీసుకున్న ఈసీ రైతు బంధు పర్మిషన్ ను రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement