Tuesday, May 7, 2024

టీకా కోటా పెంచండి…

వెంటనే 13 లక్షల డోస్‌లు ఇవ్వండి
తలకుమించిన భారంగా ఇతర రాష్ట్రాల రోగులు
రెమ్‌డెసివిర్‌, టోసిలిజుమాబ్‌లకు తీవ్ర కొరత ఉంది
లెక్కలకు సంబంధం లేకుండా రెట్టింపు చేయాలి
2వేల వెంటిలేటర్లు ఇవ్వండి
కేంద్రమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌, : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సీజన్‌, రెమిడిసివర్‌ ఇంజక్షన్లు, వ్యాక్సీన్లు, టెస్టింగ్‌ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబ ంధిత మందులు సామాగ్రి కోటాను పెంచి సత్వర సరఫరా చేస్తామని రాష్ట్రానికి కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్‌ వివిధ రాష్ట్రాలతో బుధవారం వీడియో కాన్పరెన్సు నిర్వహంచారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌ నుంచి ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్‌ రావు ఆదేశాల మేరకు మంత్రి హరీష్‌ రావు వీడియో కాన్పరెన్స్‌ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఎం సెక్ర టరీ, కోవిడ్‌ ప్రత్యేక అధికారి రాజశేఖర్‌ రెడ్డి, హెల్త్‌ డైరక్టర్‌ శ్రీనివాసరావు, డిఎంఈ రమేశ్‌ రెడ్డి, టెక్నికల్‌ అడ్వయిజర్‌ గంగాధర్‌ లు పాల్గొన్నారు.
వివిధ రాష్ట్రాలలో కరోనా పరిస్థితిని, కట్టడికోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, తదితర అంశా లను కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను నియంత్రిత చర్యలను మంత్రి హరీష్‌ రావు వివరించారు. రాష్ట్రానికి కావాల్సిన వాక్సీ న్లు ఆక్సీజన్‌ తదితరాల కోటాను మరింతగా పెంచి సత్వరమే సరఫరా అయ్యేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు.
మౌలిక వసతులు గణనీయంగా పెంచాం: హరీష్‌
మొదటి వేవ్‌ కరోనా సందర్భంలో వున్న మౌలిక వసతు లను రెండో వేవ్‌ వరకు రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిం దని మంత్రి హరీష్‌ ఈ సందర్భంగా వివరించారు. నాడు కేవలం 18,232 బెడ్లు మాత్రమే వుంటే నేడు వాటి సంఖ్య 53,775 కి మూడు రెట్లు పెరిగిందన్నారు. సిఎం కెసిఆర్‌ ముందు చూపుతో, 9213 గా వున్న ఆక్సీజన్‌ బెడ్ల ను 20738 కి,. ఐసియు బెడ్లను 3264 నుంచి 11274 కు ప్రభుత్వం పెంచిందన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యా ప్తిని అరికట్టేందుకు సిఎం కేసీఆర్‌ ఆదేశాలతో వైద్యారో గ్యశాఖ డోర్‌ టు డోర్‌ కొవిడ్‌ ఫీవర్‌ సర్వే ను నిర్వహస్తున్నదని వివరించారు. అంగన్‌ వాడీ, ఆశా వర్క ర్లు, ఎఎన్‌ఎం సిబ్బందితో కూడిన 27,039 టీంలు ఇంటింటికి వెళ్లి జ్వర పరీ క్షలు నిర్వహస్తున్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు. అను మానితులకు కరోనా నియంత్రిత మందు లతో కూడిన హెల్త్‌ కిట్లను ఉచితంగా ప్రభుత్వం అందచేస్తున్నదని తెలి పారు. ఈ కార్యక్రమం ద్వారా కరోనా సోకిన విషయం పట్ల అవగాహన లేని వారిని గుర్తించి.. కరోనా వ్యాప్తి చెం దకుండా ముందస్తు గానే అడ్డుకోవడం,తద్వారా దవాఖానా లో చేరే పరిస్థితి నుంచి, మరణించే ప్రమాదాల నుంచి కాపాడినట్ట వుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమం సత్ఫలి తాలనిస్తున్నద న్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 లక్షల ఇండ్లల్లో కోవిడ్‌ జ్వర పరీక్ష లను నిర్వ#హంచి అనుమానితులను ఐసోలేషన్‌లో వుంచి వారికి హెల్త్‌ కిట్లు అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నేటి నుంచి లాక్‌డౌన్‌ అమలవుతున్నదని కేంద్రమంత్రికి తెలిపారు.
కేసీఆర్‌ ఆదేశాల మేరకు పలు వినతులు
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు, రాష్ట్రం తరఫున కేంద్రమంత్రికి మంత్రి #హరీష్‌ రావు పలు విజ్జప్తులను చేశా రు. తెలంగాణ మెడికల్‌ #హబ్‌ గా మారిన నేపథ్యంలో, తెలం గాణలోని స్థానిక కరోనా రోగు లకు అధనంగా ఇతర రాష్ట్రాల నుంచి కరోనా రోగుల రద్దీ విపరీతంగా పెరిగిందన్నా రు. తెలంగాణ చుట్టు పక్కల వున్న మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ వంటి పలు రాష్ట్రాల నుంచి కరోనా పాజిటివ్‌గా నమో దెన వారు తెలంగాణ కు వచ్చి ట్రీట్‌ మెంటు పొం దు తున్నారని తెలిపారు. వారి వారి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ గా లెక్కింప బడి రికార్డుల్లోకి ఎక్కిన వారు తెలంగాణకు వచ్చి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న నేపథ్యంలో కొవిడ్‌ పాజిటివ్‌ లెక్కల్లో తేడా వస్తున్నదని తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిందన్నారు. తెలంగాణకు జనాభా ప్రాతిపదిక కాకుండా, ఇతర రాష్ట్రాల పాజిటివ్‌ కేసులను కలుపుకుని, రాష్ట్రంలో ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల బెడ్ల సంఖ్య ఆధారంగా మందులు ఆక్సీజన్‌ ఇతరాల కేటాయిం పులు జరపాలని మంత్రి కోరారు. తెలంగాణలో మందుల కొరత పెరగడానికి ఈ లెక్కల్లో తేడా ప్రధాన కారణమని కేంద్ర మంత్రికి హరీష్‌ రావు వివరించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి మరింతగా, అన్ని రకాల కోటాను పెంచాల్సి వున్నదని కోరారు. ఆక్సీజన్‌ సర ఫరా పెంచాలన్నారు. రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్ల కోటాను, వాక్సీన్ల కోటాను పెంచి తక్షణమే సరఫరా చేయాలని కోరారు. తెలం గాణకు కేటాయించిన 450 మెట్రిక్‌ టన్నుల ఆక్సీజన్‌ ను 600 మెట్రిక్‌ టన్నులకు పెంచాలన్నారు. ఒడిశా తదితర సుదూర ప్రాంతాలనుంచి కాకుండా, దగ్గరలో వున్న రాష్ట్రాలనుంచి ఆక్సీజన్‌ క్రయోజనిక్‌ ట్యాంకర్లను కేటాయించాలని కోరారు. తద్వారా తరలింపునకు సులువవు తుందని వివరించారు. పక్కన వున్న ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్ట్రాల నుంచి కేటాయింపులు చేయాలన్నారు. రెండో డోస్‌ కొవిడ్‌ టీకాను ను సిఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో అమలుపరుస్తున్నామ న్నారు. ఈ నేపథ్యంలో మొదటి డోస్‌ కోసం 96 లక్షల వాక్సిన్లు, సెకండ్‌ డోస్‌ పూర్తి చేయడం కోసం 33 లక్షల వ్యాక్సీ న్లు మొత్తం 1 కోటీ 29 లక్షల వ్యాక్సీన్ల అవసరంవున్నదని తెలిపారు.
ఈనెల చివరి వరకు గాను 10 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సీన్లు 3 లక్షల కోవాక్సిన్‌ వ్యాక్సీన్లు మొత్తం 13 లక్షల వ్యాక్సీన్ల తో పాటు 2 వేల వెంటిలేటర్ల తక్షణావసర మున్నదని, వెంటనే రాష్ట్రానికి సరఫరా చేయాలని మంత్రి #హరీష్ రా వు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి విజ్జప్తి చేశారు. వీడియో కాన్పరెన్సు సందర్భంగా తెలంగాణ రాష్ట్రం చేసిన విజ్జప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి హర్షవర్దన్‌ వివరాలన్నీ నోట్‌ చేసుకున్నామని, తప్పకుండా రాష్ట్ర అవస రాలరీత్యా సరఫరా కు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.
రోజుకు 20వేల‌ రెమ్‌డిసివిర్‌ ఇంజిక్షన్లు..
ఇప్పటికే సిఎం కేసీఆర్‌ కేంద్ర మంత్రితో మాట్లాడివున్నం దున రెమ్‌డిసివిర్‌ ఇంజిక్షన్లను రోజుకు 20 వేలకు పెంచాలని కేంద్ర మంత్రిని మరోమారు మంత్రి హరీష్‌ రావు కోరారు. ఎయిర్‌ అంబులెన్సుల ద్వారా అత్య వసర చికిత్సకోసం ఇతర ప్రాంతాల నుంచి కరోనా రోగులు తెలంగాణకు తరలి వస్తున్నారని, ఈ సందర్భంగా కేవలం 810 మాత్రమే అందచేస్తున్న టోసిలీ జుమాబ్‌ మందులను రోజుకు 1500 కు పెంచాలన్నారు. ప్రతిరోజు తెలంగా ణకు 2 లక్షల టెస్టింగ్‌ కిట్లు అవసరమున్న పరిస్తితుల్లో వాటిని తక్షణమే సరఫరా చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement