Sunday, May 5, 2024

ప్రేమ పేరుతో వేధింపులు, యువతిపై హత్యాయత్నం.. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

వరంగల్: వ‌రంగ‌ల్ జిల్లా కేంద్రంలోని సుబేదారి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని గాంధీన‌గ‌ర్‌లో నిన్న ఓ యువ‌తిపై వేధింపుల‌కు పాల్ప‌డ‌డ‌మే కాకుండా హ‌త్యాయత్నానికి పాల్ప‌డ్డ వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి బాధితురాలి కుటుంబ స‌భ్యులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. ఓ యువ‌తిపై సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన అజారుద్దీన్ కత్తితో దాడి చేశాడు. ప్రేమించాలని వేధింపుల‌కు గురిచేశాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కి త‌ర‌లించారు పోలీసులు. నిందితుడు హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తి, వాడిన మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

బాధితురాలి బంధువులు, నేరస్తుడు ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో పరిచయం ఏర్పడింది. త‌న‌ ఫోన్ నెంబర్ తీసుకుని ప్రేమించమని వేధింపుల‌కు గురిచేశాడు. అతని ప్రవర్తన నచ్చక ఆ యువ‌తి మాట్లాడడం మానేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని నిందితుడు బాధితురాలి ఇంటికి వ‌చ్చి ప్రేమించాలని, లేకపోతే చంపేస్తాన‌ని క‌త్తితో బెదిరించాడు. అంతేకాకుండా త‌న వెంట తెచ్చుకున్న‌ క‌త్తితో యువ‌తి మెడపై కోసి అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement