Friday, May 10, 2024

చేనేత – జౌళి శాఖకు రూ. 5752కోట్లు కేటాయించాం.. మంత్రి కేటీఆర్

ఎనిమిదేళ్లలో చేనేత-జౌళి శాఖకు రూ.5752కోట్లు కేటాయించామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో నిర్వహించిన పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ… వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద రంగం చేనేత, జౌళి రంగం అని కేటీఆర్ తెలిపారు. ఆనాడు మీ కష్టాలను అర్థం చేసుకుని, 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత, జౌళి బడ్జెట్‌ ను రూ. 70 కోట్ల నుంచి రూ. 1200 కోట్లకు పెంచారు. చేనేత, జౌళి శాఖకు ఇప్పటి వరకు రూ. 5,752 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ రంగంపై కేసీఆర్‌కు మొదట్నుంచి అవగాహన ఉంది. దుబ్బాకలో హైస్కూల్‌లో చదువుకున్న సమయంలో పద్మశాలీ ఇంట్లో ఉండేవారు. అప్పట్నుంచే చేనేత కళాకారుల కన్నీళ్ల గురించి కేసీఆర్‌కు తెలుసు.

భూదాన్‌ పోచంపల్లిలో ఒకటే వారంలో ఎనిమిది మంది చేనేత కళాకారులు ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ చలించిపోయి, జోలేపట్టి డబ్బులు సేకరించి, లక్ష రూపాయాల చొప్పున ఇచ్చారు. ఎవరూ చావొద్దు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కుల వృత్తులను కాపాడుకుంటామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు చేనేత కళాకారులను కేసీఆర్ ఆదుకుంటున్నారు. సిరిసిల్లలో కూడా నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. సిరిసిల్ల గోడల మీద రాతలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారన్నారు. నేతన్న చావొద్దు.. నీ కుటుంబం ఉసురు పోసుకోవద్దని నాటి కలెక్టర్ రాయించి, ఆత్మస్థైర్యం నింపారన్నారు. సిరిసిల్లలో తొమ్మిది మంది నేతలు బలవన్మరణం పాల్పడితే.. వారిని ఆదుకోవాలని నాటి ముఖ్యమంత్రికి కేసీఆర్ లేఖ రాశారు. కానీ స్పందించలేదన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ నుంచి రూ.50లక్షలు ఇచ్చి సూక్ష్మ రుణాలు ఇవ్వండి.. ఆత్మహత్యలు ఆపండి అని కేసీఆర్ నాటి అధికారులను ఆదేశించారని మంత్రి కేటీఆర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement