Monday, April 29, 2024

NZB: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట… విప్ గంప గోవర్ధన్

బిక్కనూర్, సెప్టెంబర్ 23 (ప్రభ న్యూస్) : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చెప్పారు. శనివారం మండలంలోని గుర్జకుంటా, ర్యాగాట్లపల్లి, గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. చిన్న గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వారి మాటలను ప్రజలు తిరస్కరించాలని కోరారు. కుల సంఘాలు, పురాతన దేవాలయాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.

ఇండ్లు లేని నిరుపేదలకు త్వరలోనే స్థలాలను కేటాయించి ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరుగుతుందని గుర్తు చేశారు. లక్ష రూపాయల లోపు రుణాలను ప్రభుత్వం మాపీ చేసిందని తెలిపారు. అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మించడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వాలు గ్రామాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా 24 గంటల కరెంటు సరఫరా చేయడం జరుగుతుందని చెప్పారు. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అమలు కానీ హామీలను ప్రజలకు వివరిస్తూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, జడ్పిటిసి పద్మా నాగభూషణం గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంత రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్ లింగాల కిష్ట గౌడ్, మండల రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ రామచంద్రన్, సిద్ధిరామేశ్వర ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మండల భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు రాజమౌళి, ఆయా గ్రామాల సర్పంచులు మనోహర రమేష్ రెడ్డి, రామేశ్వర్ పల్లి సొసైటీ అధ్యక్షులు నాగార్తి భూమి రెడ్డి, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు మాధవి బలరాం, పార్టీ నాయకులు స్వామి, గోపాల్, శ్రీనివాస్, భూమయ్య, సత్యనారాయణ, రమేష్ రెడ్డి, నారాయణ, మల్లేశం, రాజిరెడ్డి, మల్లారెడ్డి, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement