Saturday, June 22, 2024

Nalgonda : గూడ్స్ రైలు కిందపడి.. ఇద్దరు బలవన్మరణం

గూడ్స్ రైలు కింద పడి ఇద్దరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని వెంకటాద్రిపాలెం గ్రామం దుర్గానగర్‌లో చోటుచేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన లక్ష్మి (24), దుర్గా ప్రసాద్ ఇవాళ ఉదయం మండల పరిధిలోని ఐలాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పట్టాల పైనుంచి తొలగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ల ఆత్మహత్యకు కారణం వివాహేతర సంబంధమే అని పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement