Sunday, May 5, 2024

TS | సింగరేణి ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నెలలోపు వేజ్ బోర్డు చెల్లించేందుకు సన్నాహాలు.

శ్రీరాంపూర్ (ప్రభ న్యూస్): సింగరేణి కార్మికులకు నెలలోపు 11వ వేజ్ బోర్డు 1,7 26 కోట్లు రూపాయలు చెల్లించడానికి సింగరేణి సంస్థ చైర్మన్ &ఎండి ఎన్. శ్రీధర్ ఆదేశాల మేరకు కసరత్తు చేస్తున్నామని ఫైనాన్స్&పర్సనల్ ఎన్. బలరాం తెలిపారు. సగటున ఒక్కో ఉద్యోగి సుమారుగా 4లక్షల వరకు ఏరియర్స్ అందుకుంటార‌ని సింగరేణి చరిత్రలో తొలిసారిగా పెద్ద మొత్తంలో వేతన బకాయిలను చెల్లిస్తున్న నేపథ్యంలో ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఉండేందుకే నెల రోజుల వ్యవధిలో రెండు విడుదలగా బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో జమచేయనున్నామని తెలిపారు.

వేతన బకాయిల లెక్కింపు ప్రక్రియను అత్యంత పగడ్బందీగా నిర్వహించడానికి పర్సనల్ విభాగం, అకౌంట్స్, ఆడిటింగ్, ఈ ఆర్ పి ఐ టి, తదితర అన్ని విభాగాల సమన్వయంతో శుక్రవారం నుంచి ప్రక్రియ ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ బకాయిలను ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న కార్మికులకు చెల్లిస్తామని పదవీ విరమణ చేసిన కార్మికులకు త్వరలో చెల్లిస్తామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement