Sunday, April 28, 2024

Good News – వ‌చ్చేనెల‌లోమ‌రో రెండు హామీలు అమ‌లు చేస్తాం…..రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పామ‌ని చెప్పామ‌ని, దానిలో భాగంగా ఇప్ప‌టికే ఉచిత బ‌స్సు, ఆరోగ్య శ్రీ పెంపు హామీల‌ను అమ‌లు చేశామ‌న్నారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి .. ఫిబ్ర‌వ‌రి నెల‌లో మ‌రో రెండు హామీలు అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు…. ఎల్బీ స్టేడియంలో నేడు జ‌రిగిన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ లెవెల్‌ లీడర్స్‌ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, తాము అధికారంలోకి వ‌చ్చి 50 రోజులు కూడా కాకముందే బీఆర్ఎస్‌ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని సీరియస్ అయ్యారు. బిఆర్ఎస్ ప్ర‌భుత్వం ఖాళీ ఖ‌జ‌నా ఇచ్చినా నెల మొద‌టి తారీఖకే ఉద్యోగుల‌కు జీతాలు ఇస్తున్నామ‌న్నారు.. అలాగే రైతు బంధును ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులోగా అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు..


ఇక ప్రజలు పదేళ్లు అవకాశం ఇచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితబంధు, బీసీ బంధు సహా ఏ హామీని కూడా అమలు చేయలేదని అన్నారు. తనకు ఈ పదవి, హోదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చినవే అని అన్నారు. కార్యకర్తల కఠోర శ్రమ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. వాళ్లు పెట్టిన భిక్షతోనే ఈ రోజు తాను ఈ స్థానంలో ఉన్నానని భావోద్వేగానికి లోనయ్యారు. కార్యకర్తలతో పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ, కర్నాటకలో అధికారంలోకి రావడం చాలా ప్లస్ అయిందని అన్నారు.


ఈ దేశంలో త్యాగం గురించి మాట్లాడే హక్కు ఒక్క నెహ్రూ కుటుంబానికే ఉందని చెప్పారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని తెలిపారు. సంక్షోభంలో ఉన్న దేశానికి సోనియా గాంధీ స్థిరత్వాన్ని తెచ్చిందని గుర్తుచేశారు. . 18 ఏళ్లకే ఓటు, యువతకు కంప్యూటర్లు పరిచయం చేసింది రాజీవ్ గాంధీనే అన్నారు. కాంగ్రెస్ దేశం కోసం పోరాడినప్పుడు ఈ బీజేపీ పార్టీ ఎక్కడ ఉందన్నారు. మీ నాయకులు ఎవరైనా దేశం కోసం ప్రాణాలు ఇచ్చారా? అని సీఎం ప్రశ్నించారు. ఈ దేశం కోసం బీజేపీ చేసిన త్యాగాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రపతి, ప్రధాన మంత్రి పదవులు తన వరకూ వచ్చినా సోనియా, 2004 లో రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా తీసుకోలేదని అన్నారు. ఇప్పటివరకు గాంధీ కుటుంబానికి సొంత ఇళ్లు కూడా లేదంటే వాళ్లు ఎలాంటి వారో అర్ధం చేసుకోవచ్చు అని తెలిపారు. సొంత ఇళ్లు కూడా కట్టుకోలేని వారికి అవినీతి చేయాల్సిన అవసరం ఏముంటుందని ప్ర‌శ్నించారు. పదే పదే బీఆర్ఎస్ నేతలు చేస్తున్న మేస్త్రీ కామెంట్స్‌పై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, అవును నేను మేస్త్రీనే. తెలంగాణను పునర్‌:నిర్మించే మేస్త్రీని’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు

Advertisement

తాజా వార్తలు

Advertisement