Sunday, June 16, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

శంషాబాద్ (ప్రభ న్యూస్) : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో భాగంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కోలాలం పూర్ నుండి వస్తున్న ప్రయాణికుల దగ్గర 636 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.38.62 లక్షలు ఉంటుంది అంచనా.

రియాద్ నుండి వస్తున్న మరో వ్యక్తిపై అనుమానంతో తనిఖీలు చేయగా… ఐదు బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. సుమారు దీని విలువ 582 గ్రాములు రూ.35.35 లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరు వ్యక్తులపై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలపనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement