Wednesday, May 1, 2024

రైతుల సౌకర్యార్థమే గోదాముల నిర్మాణం.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

లక్ష్మణ చందా.. (ఆంధ్ర ప్రభ)రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రైతుల సౌకర్యం కోసమే ప్రభుత్వం ఈ గోదాముల‌నును నిర్మిస్తుందని రాష్ట్ర మంత్రి అన్నారు. మంగళవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మండలంలోని బోరిగాం గ్రామంలో నిర్మిస్తున్న 20 వేల మెట్రిక్ టన్నుల గోదాములను పరిశీలించారు . పనులు జరుగుతున్న తీరును కాంట్రాక్టర్ లక్కాడి జగన్మోహన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అతి త్వరలోనే నిర్మల్ లో 50 వేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి సహకారంతో ఆ గోదాం ల నిర్మాణం కూడా పూర్తయితే రైతులకు పంట నిల్వలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అన్నారు. ఇప్పుడు నిర్మిస్తున్న ఈ గోదాముల్లో ఎలాంటి రకాల పంటలను అయినా ఎరువుల నైనా నిల్వ చేసుకోవచ్చు అని తెలిపారు . గిడ్డంగుల శాఖ నుండి ప్రభుత్వం కలెక్టర్ ద్వారా తీసుకొని రైతులకు అందుబాటులో తెస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ మండల ఇన్చార్జ్ అల్లోల సురేందర్ రెడ్డి, జడ్పిటిసి రాజేశ్వర్ మాజీ డి సి సి బి చైర్మన్ రామ్ కిషన్ రెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ కన్వీనర్ కృష్ణారెడ్డి నాయకులు జిల్ల కార్యదర్శి ఆద్వాల రమేష్ అర్జున్ రెడ్డి pacs వైస్ చైర్మన్ sv రాజు డిఎం శశికళ డి సి ఎస్ ఓ మరియు తహసిల్దార్ శ్రీలత ఎంపీడీవో పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

శుభాకాంక్షలు తెలిపిన మండల నాయకులు
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ని బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి ప్రకటించిన సందర్భంగా మండల నాయకులు కార్యకర్తలు మంత్రికి అభినందనలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement