Sunday, October 6, 2024

TS: బండితో జెయింట్ కిల్లర్ భేటీ..

కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించిన జెయింట్ కిల్లర్, బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఈరోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిశారు. తనను కలిసేందుకు కామారెడ్డి నుండి కరీంనగర్ అనుచరులతో కలిసి వచ్చిన వెంకటరమణారెడ్డిని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఇరువురు అరగంటకుపైగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డిలో తన గెలుపునకు దోహదపడిన అంశాలతో పాటు కార్యకర్తల కృషి, పార్టీ సహకారం వంటి అంశాలపై చర్చించారు. మరోవైపు బండి సంజయ్ పార్టీ కార్యకర్తల ఆహ్వానం మేరకు ముగ్దుంపూర్ వెళ్లి మల్లన్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్ లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేశారని బండి సంజయ్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement