Sunday, April 28, 2024

బీసీ కుల వృత్తి లబ్ధిదారులకు లక్ష ఆర్థిక సహాయం పంపిణి చేసిన గంగుల

కరీంనగర్ – బీసీ కులవృత్తుల లక్ష ఆర్థిక సహాయం పథకాన్ని లబ్ధిదారులకు శనివారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ లో రాష్ట్ర బి సి సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అందజేసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ స్కీమ్ క్రింద నిరంతరాయ ప్రక్రియగా ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. . క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 300 మంది లబ్ధిదారులకు పథకాన్ని గ్రౌండింగ్ చేశమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా 5,28,000 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన జిల్లా యంత్రాంగంతో వేగవంతంగా కొనసాగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement