Sunday, April 28, 2024

ప్రాణం తీసిన సరద.. ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

నర్సాపూర్‌, (ప్రభన్యూస్‌): స్నేహితులతో కలిసి ఈత కోసం వెళ్లి ఇద్దరు విద్యార్థులు కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలో నీటమునిగి మృతి చెందిన సంఘటన ఈ రోజు (ఆదివారం) మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండల పరిధిలోని తుజాల్‌పూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని అర్జుతాండలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఎస్‌ఐ గంగరాజు తెలిపిన కథనం ప్రకారం. అర్జుతాండకు చెందిన కొర్ర రాకేష్‌(17) హలవత్‌ కిషన్‌(16) అనే విద్యార్థులు సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని ప్రభుత్వ ఐటిఐలో చదువుతున్నారు. అయితే ఈ రోజు (ఆదివారం) సెలవు కావడంతో అదే తాండకు చెందిన స్నేహితులు విష్ణు, ప్రభాస్‌, ప్రకాష్‌, సురేష్‌, సాయికుమార్‌ లతో కలిసి తాండ సమీపంలోని కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలో ఈత కోసం వెళ్లారు. ముందుగా కొర్ర రాకేష్‌, హలవత్‌ కిషన్‌ అనే విద్యార్థులు కాలువలో స్నానం చేసేందుకు దిగారు. ఒక్కసారిగా నీట మునిగి చాలాసేపు కావస్తున్న బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన తోటి స్నేహితులు ఈ విషయమై తాండవాసులకు తెలిపారు.

పెద్దసంఖ్యలో కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ వద్దకు వెళ్లి నీటిలో నుండి మృతిదేహాలను బయటకు తీశారు. చేతికి వచ్చిన బిడ్డలు ఒక్కసారిగా నీట మునిగి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, తాండ వాసులు కన్నీరు మున్నీరయ్యారు. అర్జుతాండలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ గంగరాజు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement