Sunday, April 28, 2024

TS : ఫుల్‌ హీట్‌….44 డిగ్రీలు దాటిన‌ టెంప‌రేచ‌ర్లు…

ఉడికిపోతున్న ఉత్త‌ర తెలంగాణ‌
వ‌రంగ‌ల్ జిల్లాలో మ‌రీ దారుణం
ఇవ్వాల కూడా హాట్ హాట్ వెద‌రే
అల‌ర్ట్ జారీ చేసిన వాతావ‌ర‌ణ కేంద్రం

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు వీయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.11 జిల్లాల్లో టెంపరేచర్లు 44 డిగ్రీల సెల్సియస్​ పైగానే రికార్డయ్యాయి. 13 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా, 8 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదయ్యాయి.

- Advertisement -

హైదరాబాద్ ​లో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పలు ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడు, సూర్యాపేట జిల్లా పెన్​పహాడ్, నల్గొండ జిల్లా నాంపల్లిలో అత్యధికంగా 44.5 డిగ్రీల గరిష్ట రికార్డు అయ్యింది.

వ‌రంగ‌ల్ జిల్లాలో మ‌రీ దారుణం..

మరిపెడ, మేడారం, హాజీపూర్, ఎల్కపల్లిలో 44.4 డిగ్రీలు, ముదిగొండ, కన్నయ్యపల్లి 44.3, కోల్వాయి 44.1, వీణవంక 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనిరి, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లిలో 43.5 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డు అయ్యాయి. జనగామ, జోగులాంబ గద్వాలలో 43.7, వరంగల్, నిర్మల్​లో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. సంగారెడ్డి 42.5, కామారెడ్డి 42.1 లో 41.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇవ్వాల కూడా హాట్ హాట్ వెద‌ర్‌

ఆదివారం కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ తెలంగాణలో వేడీ తీవ్రత భారీగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని వివరించింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలతో పాటు జనగామ, సిద్దిపేట, మెదక్​, కామారెడ్డి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

ఉత్త‌ర తెలంగాణ‌కు అల‌ర్ట్‌..

మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో అత్యధికంగా టెంపరేచర్ల నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లాలోని 30 మండలాలు, సూర్యాపేటలోని 18 మండలాలు, భద్రాద్రిలోని 19 మండలాలు, ఖమ్మంలోని 18, మంచిర్యాలలోని 11 మండలాలు, పెద్దపల్లి జిల్లాలోని 10 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement