Sunday, December 10, 2023

ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు ? … బండి సంజ‌య్

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఏం సాధించిందని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ‘‘కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా ? దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తారా ? ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ జిమ్మిక్కు’’అని ధ్వజమెత్తారు.

- Advertisement -
   

రాష్ట్రపతితో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను కొట్టి పారేశారు. రాష్ట్రపతిని ఓడించాలనుకున్నోళ్లే… ఆమెపై మొసలి కన్నీరు కారుస్తుండటం సిగ్గు చేటన్నారు. గత మూడేళ్లలో ఏనాడూ డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని కొన్ని పత్రికలు ప్రచారం చేయడం విడ్డూరమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement