Monday, April 29, 2024

వరద తీవ్రతతో ఎల్ ఎం డి 6 గేట్లు ఎత్తి వేత

తిమ్మాపూర్ సెప్టెంబర్ 5( ప్రభ న్యూస్).గత రెండు రోజుల నుండి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని చెరువులు జలకళను సంతరించుకుని మత్తల్లు పొంగి పోర్ల్లి మోయా తున్న వాగు లో అధిక నీరు ప్రవహిస్తోంది కురుస్తున్న వర్షాలకు కుంటలు  చెరువులు మత్తడి పడి  మానేరు డ్యాం లోకి వరద నీరు ఉప్పొంగుతుంది. కాకతీయ కెనాల్ నుంచి 3 వేల కృసెక్కులనీరు బయటకు పోతుంది.   మిడ్ మానేరు నుంచి లోయర్ మానేర్ కు 25584వేల క్యూసెక్కుల నీరు గంట గంటకు వరద ఫ్లో పెరుగుతూ వస్తుంది.

ప్రస్తుతం లోయర్ మానేరు డ్యాం 20.700 టిఎంసిలు నిరు ఉంది.లోయర్ మానేరు డ్యామ్ కెపాసిటీ 24 టిఎంసిలు గా ఉంది.వరద త్రివత తో ఎస్ ఆర్ ఎస్ అధికారులు 6 గంటలకు ఎత్తి 18వేల నీరు కృసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఎల్ఎండి లోతట్టు ప్రాంతాల పరిసర ప్రజలు వాగు చుట్టూ పోవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులుకోరారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement