Thursday, May 2, 2024

TS : అయిదు రోజుల పాటు ఎండ మంట‌లు… 40 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు…

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత పెరిగిపోయింది. ఫిబ్ర‌వ‌రి చివరి వారం నుంచే ఉష్ణోగ్రతలు గరిష్ఠానికి చేరాయి. ఉదయం, సాయంకాలం కాస్త చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం సూర్యుడు విజృంభిస్తున్నాడు. గ‌త వారం రోజులుగా మాడ్చేస్తున్న ఎండల తీవ్రత మరో ఐదు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ నెల 7 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. రోజువారీ టెంపరేచర్ 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. గురువారం వరకు పగటి పూట 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో రాత్రి వేళల్లోనూ సాధారణ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పారు. వారం రోజులుగా ఎండల తీవ్రతకు నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement