Thursday, April 25, 2024

Fire: మానవపాడు తహసీల్దార్ ఆపీసులో ఫైర్‌..కీలక రికార్డులు దగ్ధం

మానవపాడు (ప్రభన్యూస్): జోగులళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల త‌హ‌సీల్దార్ ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్ జ‌రిగింది. ఈ అగ్ని ప్రమాదంలో తహసీల్దార్ కార్యాలయంలోని పలు ఫైళ్లు, కీలక రికార్డులు ద‌గ్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.

మానవపాడు త‌హ‌సీల్దార్ ఆఫీసులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఫైర్ యాక్సిడెంట్ లో పలు కీలకమైన ఫైళ్లు దగ్ధం అయినట్లు ప్రచారం జరుగుతుండటం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఘటన జరిగిన సమాచారం తెలిసి కూడా అధికారులు వెంటనే ఆఫీసుకు రాకపోవడం గమనార్హం. తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంతో స్థానికుల్లో ఆందోళన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఉన్న‌తాధికారులు విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement