Wednesday, October 9, 2024

Breaking: నీలోఫర్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి మొదటి అంతస్తు ల్యాబ్ లో మంటలు చెలరేగాయి. ఆస్పత్రి పరిసరాలు పొగతో నిండిపోయాయి.

ఒక్కసారిగా చెలరేగిన మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఆస్పత్రిలోని పిల్లలు, పెద్దలు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement