Thursday, May 2, 2024

TS : తాండూర్‌లో అగ్ని ప్రమాదం.. లక్షల్లో ఆస్తి నష్టం..

ఇవాళ వికారాబాద్ జిల్లా తాండూరులోని మార్వాడీ బజార్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభ‌వించింది. అనుకోకుండా ఓ కూలర్ల దుకాణాల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు దుకాణాల్లో వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు పేర్కొన్నారు. అయితే, ప్రమాదం షాట్ సర్య్కూట్ వల్ల జరిగిందా.. మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement