Sunday, April 28, 2024

Fire Accident: రాజేంద్రనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

రాజేంద్రనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సన్ సిటీ దగ్గర ఓ క్రేకర్స్ షాపులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న ఫుడ్‌కోర్టుకు వ్యాపించాయి. దాంతో అందులోని సిలిండర్ పేలిపోయింది.

దాంతో మంటలు మరింత పెరిగి.. పక్కనే ఉన్న మరో రెండు షాపులకు వ్యాపించాయి. బాణసంచా షాపు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు ఫైరింజన్లతో మంటల్ని ఆర్పుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement