Monday, April 29, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 68
68.
య ఇమం పరమం గుహ్యం
మద్భక్తేష్వభిధాస్యతి |
భక్తిం మయి పరాం కృత్వా
మామేవైష్యత్యసంశయ: ||

తాత్పర్యము : ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధ భక్తి యోగము నిశ్చయముగా కలుగును. ఆంత్యమున అతడు నన్నే చేరగలడు.

భాష్యము : భక్తులు కానివారు శ్రీకృష్ణున్ని గాని, భగవద్గీతను గానీ అర్థము చేసుకొనలేరు కనుక భగవద్గీత అనేది భక్తుల మధ్య చర్చించుటే శ్రేయస్కరము. శ్రీకృష్ణున్ని వాస్తవముగా మరియు భగవద్గీతను యథాతథముగా స్వీకరించని వారు భగవద్గీత పై వ్యాఖ్యానము చేసి అపరాధులు కారాదు. శ్రీకృష్ణున్ని భగవంతునిగా స్వీకరించిన వారకే భగవద్గీతను వివరించవలెను. భగవద్గీత అనేది భక్తులకు సంబంధించినది గానీ, మాయా కల్పనల ద్వారా తత్వమును అర్థము చేసుకుందాము అనే వారికి కాదు. ఎవరైతే భగవద్గీతను యథాతథముగా భోదించుటకు ప్రయత్నించుదురో వారు భక్తిలో ఎదిగి శుద్ధ భక్త స్థితిని చేరుకొందురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement