Sunday, October 13, 2024

నిరుపేద మేఘన చదువుకు ఆర్థిక సాయం

పెద్ద అంబర్ పేట-ఆగస్ట్27(ప్రభ న్యూస్) ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడ గ్రామపంచాయితీ అనుబంధ గ్రామం(ఏర్రగుంట) కు చెందిన కత్తుల అండలు దేవదాసు దంపతుల కుమార్తె కత్తుల మేఘన కు మిడ్ ఎగ్జామ్ లో11వేల స్టేట్ ర్యాంక్ వచ్చింది, తద్వారా సిద్దిపేట జిల్లా RVM కాలేజ్ లో ఉచిత MBBS సీటు రావడంతో నిరుపేద కుటుంబం కావడంతో అమ్మాయి చదువు కోసం టీపీసీసీ కార్యదర్శి, ప్రచార కమిటీ కార్యనిర్వహక సభ్యులు దండెం రాంరెడ్డి రూ.10,000/- ఆర్థిక సాయం అందజేశారు., మునుముందు అమ్మాయి చదువుకు ఎటువంటి అవసరాలు ఉన్న అండదండగా ఉంటానని తెలియజేసారు. అదేవిధంగా ర్యాంక్ సాధించిన మేఘన ను అభినందించారు.

.ఈ కార్యక్రమంలో పోల్కంపల్లి ఎంపీటీసీ మంగ రవీందర్, సప్తగిరి, కత్తుల అండలు, మాజీ సేవాదళ్ చైర్మన్ రాంబాబు, ఉసిగారి మధు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement