Tuesday, May 28, 2024

TS : సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం… ముగ్గురు దుర్మరణం

సూర్య‌పేట జిల్లాలో ఈ ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఖమ్మం- సూర్యాపేట 365 జాతీయ రహదారిపై బ‌స్సు,ఆటో ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఆటోలోని ముగ్గురు ప్ర‌యాణీకులు అక్క‌డిక్క‌డే మృతి చెందారు. మరో ఇద్దరికి సీరియస్ గా ఉంది.

మోతె మండల కేంద్రంలో బుధవారం కేశవపురం – మోతె గ్రామ అండర్ పాస్ క్రాస్ చేస్తుండగా ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మహిళలు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిర డిపో నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు మోతే మండల కేంద్రంలో క్రాస్ చేస్తుండగా మునగాల మండలం రామసముద్ర గ్రామానికి చెందిన కూలీల ఆటో మోతే నుండి హుస్సేన్ బాద్ గ్రామానికి వెళ్తుండగా ఆటోను అటుగా వస్తున్న బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఆటోలో మొత్తం 12 మంది ఉన్నారు.కూలీలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై యాదవేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement