Monday, April 29, 2024

TS : రాష్ట్రంలో మూడు చోట్ల ఫార్మి విలేజ్‌లు ఏర్పాటు చేస్తాం…. రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో మూడు చోట్ల ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలో జీనోమ్ వ్యాలీ ఫేజ్-2ని కూడా ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న బయో ఏషియా సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో హైదరాబాద్‌ను లైఫ్ సైన్సెస్‌కు రాజధానిగా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా 1/3 వంతు ఫార్మా ఉత్పత్తులను ప్రపంచానికి సరఫరా చేయడం సంతోషదాయమని అన్నారు.

హైదరాబాద్‌ ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో అగ్రగామిగా ఉందని వివరించారు రేవంత్ . ఇప్పటికే దావోస్‌ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో పాల్గొని రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కొవిడ్‌ అనంతరం ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించామన్నారు. లైఫ్‌సైన్సెస్‌ రాజధాని మన నగరం అని అనడంలో ఎలాంటి సందేహం లేదంటూ ప్రపంచంలో మూడు కొవిడ్‌ వ్యాక్సిన్‌లు వచ్చాయని, వాటిలో ఒక వ్యాక్సిన్‌ను అందించిన ఘనత హైదరాబాద్‌కు దక్కిందని గుర్తు చేశారు.

- Advertisement -

ఎన్నో పరిశోధనలకు నిలయంగా మన భాగ్యనగరం ఉందని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ, స్టార్టప్‌ కంపెనీలకు ప్రోత్సాహం అందించడంతో పాటు ఎంఎస్‌ఎంఈలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. ఫార్మా రంగంలో సవాళ్లను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఇటీవల కొంత మంది ఫార్మా రంగ ప్రతినిధులతో సమావేశమయ్యాయని, ప్రభుత్వ పరంగా ఈ రంగానికి బాసటగా నిలుస్తామని అని భరోసా ఇచ్చారు.

ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమే ఈ ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ వేదిక కావ‌డ‌మేన‌ని అన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు 40వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పారిశ్రామికవేతలకు ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త జీవ వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకొత్సామని తెలిపారు. కేవలం పరిశ్రమల స్థాపనే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఉద్యోగాల కల్పన చేసే విధంగా పాలసీ రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని నైపుణ్య శిక్షణ కేంద్రంగా మార్చెలా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్దం చేశారని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించేలా తగిన శిక్షణ ఇచ్చేలా విధానం రూపొందిస్తున్నామన్నారు.

మూడు రోజుల పాటు జరిగే సదస్సులో 100 మందికి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు, ప్రపంచ దేశాల విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement