Wednesday, May 15, 2024

Exclusive – కాంక్రీట్ జంగిల్ భాగ్య‌న‌గ‌రంలో …. ప్లై ఓవ‌ర్ కింద ఆక్సిజన్ పార్కులు

నాగోల్ అగస్ట్ 28(ప్రభ న్యూస్) ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఫ్లై ఓవర్‌ కింద ప్రతిపాదిత ఆక్సిజన్‌ ​​పార్క్‌ను నిర్మిస్తున్నారు.ఈ పార్కు 360 మీటర్ల పొడవు,24 మీటర్ల వెడల్పు తో నిర్మాణం అవుతుంది. పార్కులో 38 రకాల 34,329 మొక్కలను నాటుతున్నారు. దీనిలో కూర్చోని సందర్శకులు హయ్ గా సేద తీరోచ్చు,సమావేశాలు నిర్వహించవచ్చు. ఉదయం సాయంత్రం వేళల్లో వ్యాయామం కసరత్తులు చేసుకునెందుకు తగిన ఏర్పాట్లు చేశారు. రూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ అంచనా వేసింది, ఈ ప్రాంతమంతా లతలతో కూడిన ఆకుపచ్చ కంచెను కలిగి ఉంటుంది. తద్వారా ఎవరూ ఇష్టానుసారంగా పార్కులోకి ప్రవేశించలేరు. మరియు ఆ ప్రాంతమంతా అందంగా కన్పీయనుంది. ఆకతాయిల నుంచి సమస్యలు రాకుండా విద్యుత్ దీపాలు సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) అధికారుల అంచనా ప్రకారం, 390 మీటర్ల సూర్యరశ్మి, 784 మీటర్ల వాకింగ్ ట్రాక్, సీటింగ్ సౌకర్యం మరియు సందర్శకులకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కూడా కామినేని ఫ్లైఓవర్ కింద ఇరువైపులా అందుబాటులో ఉంటుందని తెలిపారు. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) క్లీన్ ఎయిర్ స్టడీ ప్రకారం, ఇండోర్ మరియు అవుట్‌డోర్ వాతావరణాన్ని శుభ్రపరచడంలో సహాయపడే దాదాపు రెండు డజన్ల మొక్కలు దీనిలో ఉన్నాయని,ఈ పార్కులో ఆ మొక్కలు ఎంచుకుని పెంచుతున్నారు. పీస్ లిల్లీ, ఇంగ్లీష్ ఐవీ, స్నేక్ ప్లాంట్, డ్వార్ఫ్ డేట్ పామ్, అరేకా పామ్, వీపింగ్ ఫిగ్ మరియు మరెన్నో మొక్కలు నాటారు.

ఓజోన్‌ పొరను పరిరక్షించేందుకు, భూసారాన్ని కాపాడేందుకు నగరంలో ఆక్సిజన్‌ ​​పార్కులను నిర్మిస్తున్నామని, త్వరలో పలు ఫ్లై ఓవర్ల కింద అదే పార్కులను ఏర్పాటు చేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఈ పార్కు ను త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రతిపాదించిన ఆలోచన ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఫ్లై ఓవర్ల కింద వివిధ రకాల ఆక్సిజన్‌ ప్లాంట్లను కూడా నాటనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement