Thursday, May 16, 2024

Exclusive – ఎన్నిక‌ల వేళ ‘ఈసి’ దృష్టి – బ‌దిలీలు స‌క్ర‌మ‌మేనా…?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గత రెండు మాసాలు గా జరుపుతున్న బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించినట్టు- తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, అదనపు డీజీపీలు, ఐజీలు, డీఐజీలు, జిల్లా ఎస్పీలు ఇలా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ఆయా విభాగా ల్లో సేవలందిస్తున్న అధికారులకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అధికారులను బదిలీ చేసిందని, కీలక స్థానా ల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేవారిని నియమించిందని ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్టు- సమాచారం. ప్రభుత్వం చేప ట్టిన బదిలీలలను సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ముఖ్య కార్యదర్శి అవినాష్‌ కుమార్‌ తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించినట్టు- విశ్వసనీయ వర్గాలు చెబు తున్నాయి.

ముఖ్యంగా పోలీస్‌శాఖలో భారీఎత్తున జరి గిన బదిలీలపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టిందని అంటు-న్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీర్ఘ కాలికంగా ఒకే స్థానంలో పనిచేస్తున్న వారిపై ప్రభుత్వం బదిలీ వేటు- వేసింది. అయితే అధికారుల బదిలీలకు సంబంధించి ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయకుండా ప్రభుత్వం తమకు కావాలసిన అధికారులను ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక బాధ్యతల్లో నియమించారని ఫిర్యాదులందినట్టు- సమాచారం. పోలీస్‌శాఖలో జరిగిన బదిలీల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉన్నట్టు- కూడా పేర్కొన్నట్టు- ప్రచారం జరుగుతోంది. మంత్రులు తమకు అనుకూలంగా వ్యవహరించేవారిని ఎంపిక చేసుకుని జిల్లా స్థాయి అధికారులుగా నియమించుకున్నారని, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఆర్డీవో, ఎమ్మార్వో, సబ్‌ డివిజనల్‌ పొలీసు అధికారులుగా తాము విశ్వసించేవారిని సిఫారసు చేసి బదిలీ చేయించుకున్నట్టు- ఫిర్యాదులో ప్రస్తావించినట్టు- సమాచారం.

అత్యధికంగా వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో?
కేంద్ర ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదుల్లో వరంగల్‌ జిల్లా పోలీసు కమిషనరేట్‌లో జరిగిన బదిలీల్లో నిబంధనలు పాటించలేదని ఉన్నట్టు- తెలుస్తోంది. ఈ కమిషనరేట్‌లో అత్యధికంగా 21 మంది, కరీంనగర్‌ 12, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8, మహబూబాబాద్‌లో 3, ములుగులో 3, రామగుండంలో 3, జగిత్యాలలో 1 చొప్పున బదీలల్లో నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా ఉత్తర్వులిచ్చారని, వీటిని అక్రమ బదిలీలుగా పరిగణించాలని ఫిర్యాదుదారులు పేర్కొన్నట్టు- చెబుతున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం జులై 31వ తేదీ లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నా ఆ తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగించి పాత తేదీలతో ఉత్తర్వులు జారీచేశారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్టు- తెలుస్తోంది. ఇలా కొత్త స్థానాల్లోకి వచ్చినవారితో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించడం సాధ్యం కాదనే భావనలో ఎన్నికల సంఘం ఉన్నట్టు- తెలుస్తోంది. బదిలీల వ్యవహారంపై ఎన్నికల సంఘం విశ్రాంత ఐపీఎస్‌, ఐఏఎస్‌లతో సహా నిఘా వర్గాల నుంచి కూడా సమాచారం సేకరిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ జారీ అయ్యాక ప్రవర్తనా నియమావళి (కోడ్‌) అమలులోకి వస్తుంది. ఆపై ప్రస్తుతం జరిగిన బదిలీల్లో అనేక స్థానాలను ఎన్నికల కమిషన్‌ మార్చే అవకాశం ఉంటు-ంది. బదిలీలు సర్వసాధారణమైనప్పటికీ నిర్ణీత కాలపరిమితితో అవి జరగాల్సి ఉంటు-ంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం భారీ ఎత్తున అధికారులకు స్థానచలనం కల్పించింది. అయితే ఈ దఫా గతానికన్నా భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయి. ఒకే పోస్టులో దీర్ఘకాలంగా (మూడేళ్లు పైబడి) పనిచేస్తున్న అధికారులతోపాటు-, పోలీసు శాఖలో సీఐ నుంచి డీఎస్పీగా, డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీలుగా భారీ సంఖ్యలో ప్రభుత్వం పదోన్నతులను కల్పించింది. ఈ నేపథ్యంలో పొలీసు శాఖలో భారీ సంఖ్యలో స్థానచలనం తప్పలేదని చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈసారి స్టేషన్‌ హౌస్‌ఆఫీసర్లు(ఎస్‌ హెచ్‌వో)గా ఉండే ఎస్‌ఐ పోస్టుల నుంచి నాన్‌కేడర్‌ ఎస్పీల వరకు బదీలలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాల్సి వచ్చింది. కీలక పోస్టుల్లో చోటు- దక్కించుకునేందుకు అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ఆశ్రయించారన్న ప్రచారం కూడా జరిగింది.

ప్రత్యేక బృందాలతో వివరాల సేకరణ
రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు- చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇటీ-వల ఇక్కడకు వచ్చిన ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు పోలీసు శాఖతో సహా ఆయా విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. పోలీస్‌శాఖలో రాజకీయ నేతల సమ్మతి, సిఫార్సు ఆధారంగా బదిలీలపై వచ్చినవారి ప్రభావం ఎన్నికల ప్రక్రియపై ఉంటు-ందని ఈసీ గుర్తించింది. దీనిపై వివరాలు సేకరించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనున్నట్టు- తెలిసింది. వీరిలో మాజీ ఐపీఎస్‌ అధికారులతో పాటు- నిఘా వర్గాలకు చెందినవారు ఉంటారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement