Sunday, May 5, 2024

Election Campaign – ఇప్ప‌టికే రెండు సార్లు ఓడించారు…ఈసారి గెలిపించ‌క‌పోతే అలుగుతా… మ‌ధిర ఓటర్ల‌తో కెసిఆర్

కాంగ్రెస్ రాజ్యంలో రాక్షస కోణం
బీఆర్ఎస్ పాలనలో మానవీయ కోణం
నిజమేదో..అబద్ధమేదో గుర్తించండి
కాంగ్రెస్ నాయకులకు ధరణీ వద్దు
ఉచిత కరెంటు వద్దు
హైదరాబాద్లో పంచుకుని తినుడే
అభివృద్ధి, సంక్షేమంలో
బీఆర్ఎస్కు తిరుగులేదు
రెండుసార్లు ఓడించారు
ఈ సారి అలుగుతా .
మధిర ప్రజలకు కేసీఆర్ గోస

‘‘కాంగ్రెస్ రాజ్యంలో కపడేది రాక్షస కోణం, బీఆర్ఎస్ది మానవీయ కోణం ఒక్కసారి ఆలోచించండి, కాంగ్రెస్కు కరెంటు వద్దు, రైతు బంధు వద్దు, హైదరాబాద్ను మాత్రం పంచుకుని తినొచ్చు .. ఇదీ కాంగ్రెస్ కథ.. అందుకే ఒక్క సారి ఆలోచించండి” తెలంగాణ సీఎం కె,చంద్రశేఖర్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్లొన్నారు.
కాంగ్రెస్కు కోటగా పేరొందిన ఈ నియోజవర్గం కేంద్రంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తాను చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణలో జరిగిన జరిగిన అన్యాయాన్ని బేరీజు వేశారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, ప్రజలు పొందుతున్న లబ్దినీ వివరించారు. అదే విధంగా ఈ సభకు జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఒకానొక సందర్భంలో మధిర ప్రజలను ఆకట్టకునేందుకు ఇప్పటికి రెండు సార్లు ఓడించారు, అయినా మేం బాధ పడలేదు, ఈ సారి మాత్రం అలుగుతాం, నియోజకవర్గం అభివృద్ధికి తమ అభ్యర్థిని గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.


జనం కేరింతల నడుమ కేసీఆర్ మాట్లాడుతూ, స్థానిక కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఇటివల మీడియాతో మాట్లాడుతూ, ధరణినీ బంగాళాఖాతంలో కలిపేస్తామని, తాము భూమాతను తీసుకువస్తామని గొప్పలు పోతున్నారని, ఇంతకీ వాళ్లు తెచ్చేది భూమాతనా? భూమేతనా? ధరణీ వస్తే ఏం జరుగుతుంది? మళ్లీ వీఆర్వోలు, పట్వారీలు దగ్గరకు పోవాలి, పాస్పుస్తకంలో 24 కాలమ్స్ పెడతారంట. అప్పడు ఏం జరుగుద్ది? ఎన్ని ఎకరాలు అడిగి, అందుకు అనుగుణంగా డబ్బులు ఇస్తే ఆఫీసర్లు సంతకం చేస్తారు. ఇప్పుడు రైతు బంధులో మేం డబ్బులేస్తే మీ సెల్ ఫోన్లు టింగు, టింగుమంటున్నాయి, బ్యాంకులో డబ్బులు తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు. ధరణీ తీస్తే.. రైతు బంధు వస్తాదా? రైతు బీమా వస్తాదా?. వైకుంఠ పాళిలో కైలాసానికి పోతే పెద్ద పాము మింగితే కిందకొచ్చినట్టు మళ్లీ కిందకు పడ్తాం, ఈ ప్రమాదాన్ని గుర్తించండి, ఏది నిజం, ఏది అబద్ధమో తెలుసుకోండని కేసీఆర్ ప్రజలను కోరారు. సమాజ వ్యతిరేక, రైతు వ్యతిరేక పార్టీని గెలిపిస్తే.. అంతా నష్టమే.
ప్రజాహితాన్ని కోరుకునే బీఆర్ఎస్ను గెలిపిస్తే అద్భుతాలు జరుగుతాయి. మధిర ఆయకట్టు పరిస్థితి చూడండి. పక్కనే గోదారిలో లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. గోదారి నీళ్లు ఎత్తిపోయాలనే జ్ఙానం కాంగ్రెస్కు లేదు. అందుకు సీతారామ ప్రాజెక్టు పని చేపట్టాం, ఏడు నెలల్లో పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టుతో పాలేరు రిజర్వాయరు ను అనుసంధానం చేస్తే 37 టీఎంసీల నీరు వస్తుంది. పాలేరు తొణకని కుండలా నిండుకుండలా కళకళలాతుంది, అని కేసీఆర్ వివరించారు.


50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణను ఆగం ఆగం చేస్తే.. కేవలం 10 ఏళ్లల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్పాం, సంపద పెంచాం, కరెంటు సమస్యను తీర్చాం, రైతాంగాన్ని స్థిరీకరించాం. ప్రజాసంక్షేమాన్ని పెంచుతున్నాం. దేశంలోనే ఏ రాష్ర్టం ఎరగని పురోగతి సాధిస్తున్న బీఆర్ఎస్ను గెలిపిస్తే … మరింత అభివృద్ధితో ప్రజల స్థితిగతులు మారిపోతాయని సీఎం కేసీఆర్ ఉద్వేగభరితంగా వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement