Sunday, May 5, 2024

Education Day Celebrations – ప్ర‌గ‌తి వైపు తెలంగాణ ప్ర‌భుత్వ విద్య …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా దినోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్య క్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. పాఠశాలల నుంచి విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో విద్యా దినోత్సవం వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. మధ్యా హ్నం 3 గంటల నుండి హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగే వేడుకలకు ముఖ్యఅతిథులుగా శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు మరికొంత మంది నేతలు పాల్గొననున్నారు. గత తొమ్మి దేళ్లలో విద్యారంగంలో రాష్ట్రం సాధించిన విజయాలు, ప్రగ తిని ఇందులో వివరించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రభు త్వ విద్యను బలోపేతం చేసేందుకుగానూ మన ఊరు-మన బడి పథకంలో భాగంగా ఆధునీకరించిన వెయ్యి పాఠశాలలను ఈరోజు ప్రారంభించనున్నారు. దాంతో పాటు 10వేల గ్రంథా లయాలు, 1600 డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ను ప్రారంభిం చను న్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఈ సందర్భంగా వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం, పాటల పోటీలు, ఆటలు నిర్వహిం చనున్నారు. ప్రభుత్వ పాఠశాలలను రంగు రంగు పూలతో, మామిడితోరణాలతో అలంకరిచి వేడుకలను ఘనంగా జరుప నున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గురుకులాలు, మహిళా వర్సిటీ, ఫారెస్ట్‌, హార్టికల్చర్‌, హెల్త్‌ యూనివర్సిటీ, జిల్లాల్లోని మెడికల్‌ కాలేజీ, జూనియర్‌, డిగ్రీ కాలేజీల ఏర్పాటుపై వివరిం చనున్నారు. పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేసి, గ్రామాల్లో విద్యార్థులతో ర్యాలీలు తీయనున్నారు. అలాగే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫామ్స్‌, టీచర్లకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. నేటి నుంచి ప్రభుత్వ విద్యార్థులకు రాగిజావను అందజేయనున్నారు.

ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యత…
విద్యార్థులపై పెట్టే ఖర్చును భావితరం బాగుకోసం పెట్టే పెట్టు-బడిగా ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ప్రభుత్వ విద్యార్దుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు కూడా సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థ లకు చెందిన బడులకు ప్రైవేటు- విద్యాసంస్థల నుంచి విద్యార్థుల వలసలు పెరుగుతున్నాయి. 2022-23 విద్యాసం వత్సరంలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరి గింది. లక్షకు పైచిలుకు విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు పొందారు. నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్‌ మీడి యంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టి కాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్న నేపథ్యంలో విద్యార్థుల నమోదు పెరిగింది. దేశంలోకెల్లా అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏ-కై-క రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రవ్యాప్తంగా 1002 గురుకుల పాఠశా లలలో 5,99,537 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమా ణాలతో విద్యాబోధన జరుగుతున్నది. గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి 1 లక్షా 25 వేల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తున్నది. మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకంతో రాష్ట్రంలోని పాఠశాలలను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 7,289 కోట్లు- కేటాయి ంచింది. రాష్ట్రంలోని 26,815 ప్రభుత్వ పాఠశాలల్లో 23,35, 952 మంది పిల్లలు చదువుకుంటు-న్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలలో, 3 దశలుగా, 26,065 పాఠశా లల్లో మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయ డం, బలోపేతం చేయడం కోసం రూ.7289 కోట్లతో మన ఊ రు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ప్రాథమికంగా మొదటి దశలో 2021-22 సంవత్స రానికి గాను 9123 పాఠశాలల్లో- రూ.3497.62 కోట్ల అంచనా బడ్జెట్‌తో పనులు చేపట్టడం జరిగింది.

అదేవిధంగా ఇంటర్మీడియట్‌ విద్యా శాఖలోనూ సంస్క రణలు చేపట్టింది. 2015-16 విద్యా సంవత్సరం నుండి ప్రభు త్వ జూనియర్‌ కాలేజీల విద్యార్థుల నుండి ఎలాంటి ట్యూషన్‌ ఫీజును వసూలు చేయకుండా ప్రభుత్వం పుస్తకాలను ఉచిత ంగా పంపిణీ చేస్తున్నది. విద్యార్థులు, కళాశాల సిబ్బంది హాజరును పర్యవేక్షించేందుకు సిసి కెమరాలు, బయో మెట్రిక్‌ డివైజ్‌లను ప్రభుత్వం జూనియర్‌ కళాశాలల్లో అమర్చింది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 48 కొత్త భవనాలు, 186 అదనపు క్లాస్‌ రూమ్‌లు, 267 ప్రహారీ గోడలు, 350 ఆర్వో ప్లాంట్‌ లను ప్రభుత్వం ఏర్పాటు- చేసింది. వీటితో కార్పోరేట్‌ సా మాజిక బాధ్యతలో భాగంగా 18 కొత్త భవనాలు, 14 అదనపు తరగతులు, 4 ప్రహారీ గోడలను చేపట్టడం జరిగింది. వృత్తి వి ద్యా కోర్సుల్లో నాణ్యమైన విద్యా బోధనకు సలహాల కోసం గాను భువనేశ్వర్‌లోని సెంచూరియన్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ యూనివర్సిటీ- తో పాటు- నైపుణ్య శిక్షణ, వ్యవ స్థాపనకు సంబం ధించి రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది.

- Advertisement -

ఉన్నత విద్యాశాఖకు ప్రాముఖ్యత…
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల నమోదుకు సంబం ధించి తెలంగాణ స్థూల నమోదు నిష్పత్తి 36.2. ఇది జాతీయ సగటు- కంటే ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా ఉన్నత విద్యార్జనలో నాణ్యత ప్రమాణాలు ఆశిం చిన స్థాయిలో పెరిగాయి. ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉండేలా ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 34 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు కొత్త భవనాల నిర్మా ణం కోసం నిధులు కేటాయించారు. అత్యంత పారదర్శకంగా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లను చేపట్టేందుకు 2016-17 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యా శాఖ దోస్త్‌ (డిగ్రీ ఆ్లనన్‌ సర్వీసెస్‌ ఆఫ్‌ తెలంగాణ-దోస్త్‌) విధానాన్ని ప్రవేశపెట్టింది. 2017 సం వత్సరంలో దోస్త్‌ అప్లికేషన్‌ కు -టె-క్నాలజీ విభాగంలో స్కోచ్‌ ప్లాటినమ్‌ అవార్డును లభించింది. తెలంగాణ స్కిల్స్‌ అండ్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ద్వా రా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచి వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నారు. డిగ్రీ కాలేజీల్లో విద్యా బోధన కోసం రెగ్యులర్‌ అధ్యాపకులతో పాటు- కాంట్రాక్టు లెక్చరర్లు, గెస్ట్‌ లెక్చరర్లు సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 450 ఉన్న అధ్యాపకుల సంఖ్య 31 మార్చి 2023 నాటికి 1940కి పెరిగింది.

సాంకేతిక విద్యలో భేష్‌…
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు- తర్వాత 12 కొత్త ప్రభుత్వ పాలి-టె-క్నిక్‌ కాలేజీలను స్థాపించారు. ఎమర్జింగ్‌ -టె-క్నాలజీలుగా ఆదరణ పొందుతున్న ఎఐ(ఆర్టిఫిషియల్‌ ఇం-టె-లిజెన్సీ, ఎంఎల్‌(మెషిన్‌ లెర్నింగ్‌), సైబర్‌ సెక్యూరిటి, డేటా సైన్స్‌, క్లౌండ్‌ కంప్యూటింగ్‌, ఎల్‌ఓటి, సిఎస్‌ఐటి, సాప్ట్‌n వేర్‌ ఇంజ నీరింగ్‌, నెట్వర్క్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ కోర్సు లను రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవె శపెట్టారు. రాష్ట్ర ఏర్పాటు- తర్వాత సిరిసిల్లా, వనపర్తి లలో జవ హర్‌ లాల్‌ నెహ్రూ -టె-క్నాలాజికల్‌ యూనివర్సిటీ- కాలేజీలను స్థాపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement