Saturday, October 12, 2024

NLG : జగదీష్ రెడ్డిగెలుపు కోసం బీఆర్ఎస్ నేత‌ల‌ ఇంటింటి ప్రచారం

పెన్ పహాడ్, నవంబర్ 26(ప్ర‌భ‌న్యూస్‌) మండల పరిధిలోని అని రెడ్డి గూడెం, మాచారం గూడెం ఎస్సీ కాలనీ ,గ్రామాలలో ఆదివారం జగదీశ్ రెడ్డి గెలుపు కోసం గడపగడప ప్రచారం నిర్వహించి, గ్రామంలో ప్రజలందరిని మీ అమూల్యమైన ఓటు బిఆర్ఎస్ పార్టీకి వేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు అని రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సబండ వర్గాలను అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టీయే అని, వివిధ సంక్షేమ పథకాలు అమలు ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు.

బిఆర్ఎస్ ను గెలిపించుటకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని వారు తెలిపారు. ఈ ఎన్నికల్లో జగదీశ్వర్ రెడ్డి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ మేనిఫెస్టో నుగడపగడప వివరించారు ఓటర్ మిషన్ ద్వారా ఓటర్స్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిఆర్ఎస్ నాయకులు గడ్డం మురారి రెడ్డి, కందిమల్ల మధుసూదన్ రెడ్డి, మందుల రమేష్, చిత్రం చందన్, కట్ట జయరాజు, గండమల్ల నాగార్జున, చిత్రం శ్రీహరి, చిత్రం శ్రీకాంత్, చిత్రం వెంకన్న, మహిళా నాయకురాలు స్వప్న ,లక్ష్మి, రజిత, నాగమ్మ ,వనిత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement