Sunday, May 5, 2024

అసాంఘిక శక్తులకు సహకరించద్దు..ఆదివాసీలకు అందుబాటులో ఉంటాం: ఏసీపీ మహేష్

ప్ర‌భ‌న్యూస్ : అసాంఘిక శక్తులకు ఆదివాసీలు ఎప్పుడు సహకరించవద్దని బెల్లంపల్లి ఏసీపి మహేష్ కోరారు. రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి, ఓఎస్డీ శరత్ చంద్ర పవార్, డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డిల ఆదేశాల మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం లైన మంగీ, తిర్యాణి ప్రాంతాలకు అనుకోని ఉన్న మంచిర్యాల జిల్లా దేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదివాసీ, కోలం, గిరిజన ప్రజలు కుర్రె గూడ, కొలాంగూడ, లక్ష్మిపూర్, వెంకటాపూర్ గ్రామం లలో బెల్లంపల్లి ఏసిపి మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామాలను సందర్శించి, గ్రామ ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నాలుగు గ్రామాల్లోని 200 కుటుంబాలకు కుటుంబానికి ఒకటి చొప్పున దుప్పట్లను బెల్లంపల్లి ఏసీపీ మహేష్, సీఐ మందమర్రి ప్రమోద్ రావు , ఎస్ఐ దేవాపూర్ విజేందర్ అందించడం జరిగింది.

ఈ సందర్బంగా ఏసీపీ ప్రజలతో మాట్లాడుతూ…. ఏదైనా సమస్యలు ఉన్నాయని అని అడగగా గ్రామ ప్రజలు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది.అదేవిదంగా పోడు భూముల సమస్య ఉంటే సంబంధిత శాఖ ల ద్వారా ప్రభుత్వం కి అప్లికేషన్ పెట్టుకోవాలని తెలపడం జరిగింది. మిగతా సమస్యలను చెప్పిన వెంటనే స్పందించి సంబంధిత శాఖలతో మాట్లాడి పరిష్కరిస్తాము అనీ పోలీసుల హామీ ఇవ్వడంతో గ్రామస్థులందరూ కృతజ్ఞతలు తెలిపారు.యువకులు ఉన్నత విద్య నేర్చుకోవాలని వారి తల్లిదండ్రుల కి మంచి పేరు తేవాలని మరియు వారి గ్రామం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో గొప్పగా మంచి పేరు తీసుకొని వెళ్లాలని, చదువు మరియు క్రీడల్లో ప్రతిభ కలిగిన యువకులను ప్రోత్సహించడానికి, పోలీస్ శాఖ మరియు ప్రభుత్వం తోడుగా ఉంటుందని వారు పేర్కొన్నారు..మావోయిస్టుల సిద్ధాంతాలు నమ్మి వారి బాటలో వెళ్లి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు జీవితాన్ని కష్టాల పాలు చేసుకోవద్దని అన్నారు.ప్రజలు ఎవ్వరు మావోయిస్టు లకు సహకరించ వద్దు ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు తమ గ్రామంలలో కనిపించిన, ఏలాంటి సమాచారం ఉన్న సంబందిత పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరడమైనది. పోలీసు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి ప్రజలు తమ ప్రశాంతమైన జీవితాన్ని శాంతియుత వాతావరణంలో గడిపేలాగా చూడడమే పోలీసుల ప్రధాన లక్ష్యం అని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement